![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1054 లో..... ఇందుని ఐశ్వర్య నుంచి సేవ్ చేసి మీటింగ్ తీసుకొని వెళ్లాలని నారాయణ అనుకుంటాడు. దాంతో రౌడీలకి నారాయణని కొట్టమని ఐశ్వర్య చెప్తుంది. మిగతా రౌడీలని నారాయణ కొట్టిన విధానం చూసి భయపడి.. వాళ్ళు నారాయణ జోలికి రారు. దాంతో బైక్ పై ఇందుని నారాయణ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు మీటింగ్ సమయం అయిపోతుంది. త్వరగా మీ నిర్ణయం చెప్పండి పరంధామయ్య గారు అని రేఖ అంటుంది. నేను ఎటు తేల్చుకోలేకపోతున్నా.. అలాగని బయట వారికి సపోర్ట్ చెయ్యలేనని పరంధామయ్య అంటాడు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక ముసలోడు నాకే సపోర్ట్ చేస్తాడని రేఖ అనుకుంటుంది. మరొకవైపు ఇందుని నారాయణ తీసుకొని వస్తాడు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమని నారాయణ అనగానే లేదని థాంక్స్ చెప్పి అతన్ని ఇందు పంపిస్తుంది.
ఆ తర్వాత పరంధామయ్య ఇక వేరే దారి లేక రేఖ పేరు చెప్పబోతుండగా అప్పుడే ఇందు ఎంట్రీ ఇస్తుంది. ఈవిడ ఎవరు అచ్చం కావ్యలాగే ఉందని ఏం తెలియనట్లుగా పరంధామయ్య అడుగుతాడు. తనని మీరు ఎప్పుడు చూడలేదు కదా.. తను కావ్య కూతురు అని రేఖ చెప్తుంది. ఇప్పుడు ఇందు మేం అంతా ఒకటే మీ సపోర్ట్ ఎవరికి అని రేఖ అడుగుతుంది. ఇందు ఉండగా నీకెలా సపోర్ట్ చేస్తానని పరంధామయ్య అంటాడు. ఇప్పుడు ఆ రాజు గాడికి ఇందు సపోర్ట్ చెయ్యకుండా ఆపి తనని సీఈఓ చెయ్యాలని రేఖ అనుకుంటుంది. ఎవరు అయితే ఏంటే నా సపోర్ట్ కూడా ఇందుకే అని రేఖ అనగానే ఇప్పుడు ఇక కొత్త సీఈఓగా ఇందు అని పరంధామయ్య చెప్తాడు. హమ్మయ్య ఆ రాజుగాడు సీఈఓ అవ్వకుండా ఆపానని రేఖ సంతోషపడుతుంది. ఇదంతా ఇందు ప్లాన్ అని పాపం తనని తెలియదని రాజు అనుకుంటాడు.
ఆ తర్వాత రాజు, ఇందు ఇంటికి వెళ్తు దారిలో మాట్లాడుకుంటారు. నువ్వు ఆ పరంధామయ్యతో డీలింగ్ మాట్లాడావట.. సీఈఓ అవ్వాలని ప్లాన్ చేసావట అని ఇందు అడుగుతుంది. ముసలోడు అంత చెప్పాడా అని రాజు అంటాడు. ఆ తర్వాత వెంకీని తీసుకొని నందు ఒక క్లౌడ్ కిచెన్ అతని దగ్గరికి వెళ్తుంది. వెంకీకి డెలివరీ బాయ్ గా జాబ్ ఇప్పించడానికి తీసుకొని వెళ్తుంది. తరువాయి భాగంలో సీఈఓగా ఇందు ఉందన్న కోపంతో తనకి ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యాలని రేఖ అనుకుంటుంది. ఇందుకి ఆఫీస్ లో ఎలా ఉండాలో సుభాష్ జాగ్రత్తలు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |